హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో టికెట్స్.. షోస్ పెంచాలంటూ కామెంట్స్‌..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బ‌రిలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పలు ప్రీమియర్ షోలు సెలెక్టెడ్ సెంటర్లో రిలీజ్ కాన్నునాయి.

ఈ ప్రీమియర్స్ కి సంబంధించిన బుకింగ్ తాజాగా ఓపెన్ చేశారు. వెంటనే హాట్‌ కేకుల్లా దీని టికెట్స్ అమ్ముడుపోయాయి. హనుమాన్ సినిమాకి పబ్లిక్ లో ఎంత క్రేజ్ ఉందో కేవలం క్షణాల్లో టికెట్స్ బుక్ అయిపోయిన ఈ దృశ్యం చూస్తే అందరికీ అర్థమయిపోయి ఉంటుంది. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అతి తక్కువ సమయంలోనే ఈ సినిమాలకు షోల్డ్ అవుట్‌ బోర్డ్ పడింది.

మరీ ముఖ్యంగా నైజం సెంటర్‌లో హనుమాన్ సినిమా టికెట్స్ జెట్ స్పీడ్ లో పూర్తయిపోయాయి. దీంతో హనుమాన్ మూవీని నైజం లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మేకర్స్ ప్రీమియర్స్ కోసం షోలు పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ప్రీవియర్స్‌ నుంచి టాక్ పాజిటివ్ గా బయటకి వస్తే చాలు.. హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో మొదటి హిట్ సినిమాగా నిలవడం ఖాయం.