“ఏంట్రా ..ఏం పీకుతావ్”.. జర్నలిస్ట్ పై కోపంతో రెచ్చిపోయిన దిల్ రాజు (వీడియో)..!!

దిల్ రాజు .. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది . దిల్ రాజు అంటే ఓ టాప్ ప్రొడ్యూసర్.. డిస్ట్రిబ్యూటర్.. స్థాయి నుంచి సొంతంగా ఎదిగి కష్టపడి టాప్ ప్రొడ్యూసర్ స్థానానికి చేరుకున్నాడు. ఏ సినిమా నైనా సరే హిట్టవుతుందా ఫట్ అవుతుందా అని సింగిల్ లైన్ లోనే చెప్పగలడు. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు విన్నాం. కానీ దిల్ రాజు బడా సినిమాలను ప్రమోట్ చేస్తూ చిన్న సినిమాలను తొక్కేస్తాడని .. ఆయనకు నెగిటివ్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళ సినిమాలను అస్సలు ఇండస్ట్రీలో ఎదగనివ్వడు అని ..

కొన్ని సైట్స్ ఇష్టం వచ్చిన విధంగా ఆయనపై తప్పుడు వార్తలు రాయడం ప్రారంభించాయి . దానికి తగ్గట్టే రీసెంట్గా రిలీజ్ అవ్వబోతున్న హనుమాన్ సినిమాకు తక్కువ థియేటర్లో కేటాయించడం వెనక దిల్ రాజు హస్తం ఉంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఇన్నాళ్లు చూస్తూ సైలెంట్ గా ఉన్న దిల్ రాజు ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు . అంతేకాదు హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలను తప్పుగా వక్రీకరిస్తూ కూడా దిల్ రాజు పై మండిపడ్డారు .

ఈ క్రమంలోనే దిల్ రాజు స్ట్రైట్ ఫార్వార్డ్ గా తాటతీస్తా.. తప్పుడు వార్తలు రాస్తే అంటూ వార్నింగ్ ఇచ్చారు . అంతేకాదు ఓ జర్నలిస్టుపై ఫుల్ ఫైర్ అయిపోయారు . “ఏంట్రా ఏం.. పీకుతావ్.. తప్పుడు వార్తలు రాస్తే తోలు తీస్తా “అంటూ ఫైర్ అయిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడు చాలా కూల్ గా సైలెంట్ గా ఉండే దిల్ రాజు ఫస్ట్ టైం ఈ విధంగా మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. అంటే ఆయన ఎంతలా హార్ట్ అయి ఉంటారో అంటున్నారు జనాలు . దిల్ రాజు స్వభావం అది కాదు అని ఆయన చాలా చిన్న సినిమాలు కూడా తెరకెక్కించారని.. ఎంతోమంది టాలెంటెడ్ ఉన్న నటులను పైకి తీసుకొచ్చారని.. ఎవరో కావాలని దిల్ రాజు పై ఇలా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న కామెంట్స్ జనాలు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు..!!