పూజ హెగ్డే ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం అదేనా.. ఇన్నాళ్లకు రివిలైన సీక్రెట్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి గోల్డెన్ లెగ్‌గా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు రావడంతో ఐరన్ లెగ్‌ ముద్ర వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్రీ బర్డ్ హీరోయిన్ గా మారిపోయింది. అవకాశాలు లేక.. వచ్చిన అవకాశాలన్నీ వదులుకుంటూ.. కెరీర్ని చేతులారా చెడగొట్టుకుంటుంది. ఆమె ప్లేస్ లో చాలా సినిమాల్లో వేరువేరు హీరోయిన్లు నటిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకుంటున్నారు.

గుంటూరు కారం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పేరు ఎక్కడ కనిపించలేదు. అయితే నాని సినిమాలో పూజకి హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపించినా.. దానిని కూడా అమ్మడు వదిలేసింది. ప్రజెంట్ పూజా హెగ్డే చేతిలో ఒకటంటే ఒక్క సినిమా కూడా లేదు. దీంతో తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆమె ఫ్యాన్సీ ఎగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పూజా హెగ్డే కి తెలుగు ప్రేక్షకులు బోర్ కొట్టేసారట. అందుకే టాలీవుడ్ అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తెలుగులో పాన్ ఇండియా వైడ్‌గా చిన్న హీరోయిన్లు సైతం భారి హిట్లు సంపాదిస్తున్న నేపథ్యంలో.. పూజా హెగ్డే వచ్చిన అవకాశాలన్నీ వదులు కోవడం చాలా ఆశ్చర్యకరం. ఇక ఇలాగే కంటిన్యూ చేస్తే నెమ్మదిగా ఈ అమ్మడు టాలీవుడ్ లో ఫెడౌట్ బ్యూటీ అయిపోతుంది.