చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2023వ సంవత్సరంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక‌ చాలామంది సినీ ప్రముఖులు చనిపోవడం వారి ఫ్యాన్స్ కి గుండె కోతని మిగిల్చింది కూడా. ఇక ఈ క్రమంలోనే మరో సినీ దర్శకుడు మరణించాడు.

ఇక తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఈన పలు షార్ట్ ఫిలిమ్స్‌కు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన కోరంగి నుంచి అనే సినిమాకి మంచి పేరు దక్కింది.

ఈ సినిమాకి ఏకంగా కోటి రూపాయల ఫండింగ్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ సినిమాలో నటించింది. ఇక ఈయన ఎటువంటి అనారోగ్యంతో బాధపడకుండానే సడన్గా గుండెపోటు తలెత్తి చనిపోయారు. ఇక ఈయన మరణ వార్త విన్న ఈయన ఫ్యాన్స్ కృంగిపోతున్నారు.