ఈ పై ఫోటోలో బుజ్జి పాపల క్యూట్ గా కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరు గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వారి చిన్ననాటి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను సెలబ్రిటీస్ ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని పాప పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఈమె పాపకాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ హీరో. గతేడాది ఓ హ‌ర‌ర్ థ్రిల‌ర్‌తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికైనా ఎవరో గుర్తుపట్టారా.. ఎస్ మీరు అనుకున్నది కరెక్టే.. అతనే సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బ‌స్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్‌ తేజ్.

తన మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఏదో సందర్భంలో వాళ్ళ అమ్మగారు ఆడవేషం వేశారట.. ఆ అరుదైన ఫోటోని ఇటీవ‌ల స్వయంగా సాయిధరమ్ తేజ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భ‌లే క్యూట్‌గా ఉన్నావ్ తేజ్ అంటూ.. సో బ్యూటీఫుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.