15 ఏళ్లు పూర్తి చేసుకున్న ” అరుంధతి ” మూవీ.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే.‌.!

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక మొదటిగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది మాత్రం 2009 జనవరి 16న రిలీజ్ అయిన ” అరుంధతి ” సినిమాతోనే.

మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి దిగంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా ఆ ఏడాది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ ని రాబట్టింది. ఇక నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్లు పూర్తి అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ఈ సినిమాకి రూ.9 కోట్లు థియేటర్ బిజినెస్ మాత్రమే జరిగింది. చాలా ఏరియాలలో ఈ సినిమాని రెంట్ల బేస్ పై ఓన్ రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా రూ. 36.15 కోట్లు కాబట్టి..రూ. 20 కోట్ల వరకు లాభాలను పెంచింది. ఈ టైం కి టాలీవుడ్ టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది అరుంధతి మూవీ.