పుట్టి ఆరు నెలలు దాటుతున్న .. ఇంకా క్లింకార ఫేస్ ను మెగా ఫ్యామిలీ దాచడానికి కారణం అదేనా..?

క్లింకార.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కూతురు . పెళ్లి అయిన 11 సంవత్సరాల కు జన్మించిన క్లింకారా అంటే మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఆమె రాకను ఎంతో సెలబ్రేట్ చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ. క్లింకార మెగా ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీలో అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి క్లిం కారాను ఓ రేంజ్ లో పొగిడేసారు.

అయితే క్లింకార పుట్టిన తర్వాత ఎక్కువ సెలబ్రేషన్స్ మెగా ఫ్యామిలీ లో జరుగుతున్నా.. కానీ ఆమె ఫోటోని మాత్రం రిలీజ్ చేయట్లేదు మెగా ఫ్యామిలీ . క్లింకార పుట్టిన తర్వాత ఎన్నో ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నింది మెగా ఫ్యామిలీ . కానీ క్లింకార ముఖాన్ని మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే పాప పుట్టి ఆరు నెలలు దాటేస్తున్న కూడా ఇంకా క్లింకార ఫేస్ ను రివిల్ చేయకపోవడంపై పలువురు జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు .

కొందరు పాపకి దిష్టి తగులుతుంది అని ఫేస్ రివిల్ చేయడం లేదు అంటే మరికొందరు దీని వెనకాల మెగా ఫ్యామిలీ ఏదో పెద్ద స్కెచ్ వేసింది అని అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం వాళ్ల పాప ముఖం రివీల్ చేయడం వాళ్ల ఇష్టం.. మనకి అనవసరం వాళ్ళ రివీల్ చేసినప్పుడే చూద్దాం ..ఎందుకు అంత తొందర అంటూ కొట్టి పడేస్తున్నారు. అసలు పాప ముఖాన్ని ఎప్పుడు చూపిస్తారు కనీసం ఫస్ట్ బర్త డే కైనా పాప ముఖాన్ని రివిల్ చేస్తారా..? అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!