హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా.. తన అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్.. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్‌లో అటు క్యారెక్ట‌ర్ అర్టిస్ట్‌గా.. ఇటు విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈయన చేతినిండా అవకాశాలను అందుకుంటు క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. మరోవైపు అతని కొడుకు రోషన్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. నిర్మ‌ల కాన్వెంట్‌తో వెండి తెరకు పరిచయమైన రోష‌న్‌, పెళ్లి సందడితో నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు.

Srikanth Family Visits Tirumala: ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో శ్రీకాంత్‌ (ఫోటోలు) | Hero Srikanth With His Family Visits Tirumala Temple Photos - Sakshi

ప్రస్తుతం మలయాళీ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రోషన్ తో పాటు శ్రీకాంత్‌కు మరో కుమారుడు రోహన్, కూతురు మేధా కూడా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎక్కువగా బయట ఈవెంట్‌లో కనిపించరు. కేవలం శ్రీకాంత్, ఊహ ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్లలో మాత్రమే వీరు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా శ్రీకాంత్ కుటుంబం మొత్తం శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్ళగా.. అక్కడ తల్లిదండ్రులతో పాటు కుమార్తె మేధా, చిన్న కుమారుడు రోహన్ కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ కుటుంబాన్ని చూసిన జనాలంతా వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

Srikanth Family Visits Tirumala: ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో శ్రీకాంత్‌ (ఫోటోలు) | Hero Srikanth With His Family Visits Tirumala Temple Photos - Sakshi

శ్రీకాంత్, ఊహ కూడా కుటుంబ సమేతంగా వీరికి సెల్ఫీలు ఇచ్చారు. ఇక చాలాకాలం తరువాత మేధా సోషల్ మీడియా వేదికపై మెరుస్తుంది. అందరు దృష్టి ఆమెపైనే ఉంది. చీర కట్టులో ఎంతో సాంప్రదాయపద్దంగా అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించిన మేధా తన అందంతో జనాన్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం తిరుమల దర్శనం చేసుకుంటున్న శ్రీకాంత్ ఫ్యామిలీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్టార్ హీరోయిన్లను కూడా త‌ల‌ద‌న్నేంత‌ అందంగా మేధా కనిపిస్తుంది అంటూ సాంప్రదాయపద్ధంగా బుట్టబొమ్మలా ఉన్నావు అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.