పల్లవి ప్రశాంత్ అరెస్టుపై మొదటిసారి స్పందించిన అమర్.. ఆ రోజే అన్ని చెప్తా అంటూ..

తెలుగు బుల్లితెరపై భారీ పాపులారిటీ తెచ్చుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక తాజాగా బిగ్‌బాస్‌ సీజన్ 7 ముగిసిన సంగతి తెలిసింది. ఈ సీజన్లో టైటిల్ విన్నార్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ ఆనందం ఎంతోసేపు లేక ముందే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. 16 రోజుల రిమాండ్ విధించగా అతని తరుపున స్వచ్ఛందంగా 50 మంది లాయర్లు వాదించి అతనికి బెయిల్ వచ్చేలా చేశారు. సీజన్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు ర‌న‌ర‌ప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ చౌదరి ఫ్యామిలీ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న టైం లో కార్ను డ్యామేజ్ చేసి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు.

వీటికి బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు ఇక జైల్లో పల్లవి ప్రశాంత్ ఉన్న సమయంలో కూడా బిగ్బాస్ నుంచి చాలామంది కంటిస్టెంట్స్ అతనికి సపోర్ట్ గా మాట్లాడుతూ అతని రిలీజ్ చేయాలని కోరిన‌ సంగతి తెలిసిందే. ఇక ర‌న‌ర‌ప్ అమ‌ర్‌.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మొదటిసారి స్పందించాడు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమర్‌దీప్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన గొడవపై స్పందించాడు. షో రిజల్ట్ ఎలా ఉన్నా.. చాలామంది మనసులు గెలుచుకున్న సంతోషంతో బయటకి వచ్చానని.. అంతలోనే అక్కడ జరిగిన ఇష్యుతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా ఈ షో కి ముందు వరకు సాధారణ ఆర్టిస్ట్ గా ఉన్న నేను.. నా ఫేవరెట్ హీరో రవితేజ గారి సినిమాలో ఆఫర్ అందుకున్న.. అది నాకు చాలా పెద్ద గెలుపు అంటూ చెప్పుకొచ్చాడు. నా లైఫ్ కు ఇంకేం కావాలి అంటూ తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. రవితేజ గారి కాల్ కోసమే వెయిట్ చేస్తున్నానని.. దీంతోపాటు ఇంకా చాలా ఆఫర్లు వచ్చాయని వీటన్నింటిని ఓ మంచి రోజున అనైన్స్ చేస్తానంటూ వివరించాడు. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై స్పందించిన అమర్‌.. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగింది పక్కన పెడితే.. పల్లవి ప్రశాంత్ అరెస్టు మాత్రం మిస్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయిందిలెండి.. ఎవరు ఏం టెన్షన్ పడనవసరం లేదు.. అందరూ బాగానే ఉన్నారు. మేము కూడా కలిసి చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు.