‘ యాత్ర – 2 ‘ టీజర్ రిలీజ్.. ఒక డైలాగ్ తో భారీ బజ్ క్రియేట్ చేసిన మేకర్స్..

మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘటనలతో తెరకెక్కుతున్న మూవీ యాత్ర. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ భారీ సక్సెస్ను సొంతం చేసుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించి మెప్పించాడు.

ఈయన రాక యాత్ర సినిమాకు మరింత హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు 2024 ఎలక్షన్ టార్గెట్ చేస్తూ యాత్ర 2ను రెడీ చేశారు మేకర్స్. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ట్ జీవా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో (శుక్రవారం) ఈరోజు మేకర్స్ యాత్ర 2 టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అతి తక్కువ డైలాగ్స్ ఉన్నా సరే ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆశ‌క్తి పెరిగేలా చేశారు. తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొడుగ్గా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలా అన్న అనే ఒక్క డైలాగ్ తో టీజర్ కే హైప్‌ తెచ్చిపెట్టారు మేక‌ర్స్‌. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.