నాని హీరో.. నాగార్జున జీరో.. అంటున్న బిగ్ బాస్ నటి ( వీడియో )..!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగానే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఏ సీజన్ కి దక్కని రెస్పాన్స్ 7వ సీజన్ కి మాత్రం బేభత్సంగా దక్కింది. ఇక గత కొన్ని సీజన్లో నుంచి నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక నాగార్జున హోస్టింగ్ కి కొందరు ఫ్యాన్స్ ఉంటే ఈ షో కి ఇంతకు ముందు చేసిన నానికి, తారక్కి మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.

కొందరు నాగార్జున కన్నా నాని హోస్టింగ్ బాగా చేశారంటూ పొగుడుతారు. ఇక కంటెస్టెంట్స్ పాల్గొన్న షో కి ఎవరు హోస్టింగ్ చేస్తే వారు ఆ హోస్ట్ ని బెస్ట్ హోస్ట్ అని చెబుతూ ఉంటారు. కానీ తాజాగా సీజన్ 6 లో పాల్గొన్న గీత రాయల్ మాత్రం నాగార్జున జీరో నాని హీరో అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతు రాయల్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ…” నాగార్జున గారు నాని గారు తారక్ గారు చేసిన హోస్టింగ్ లో నేను ఎక్కువగా ఇష్టపడేది నాని గారు హోస్టింగ్. చాలామంది చెబుతూ ఉంటారు తారక్ గారి హోస్టింగ్ బాగుంటుంది అని.. కానీ నేను సీజన్ 1 చూడలేదు. నేను ఆ సీజన్ ని తమిళ్ లో చూశాను కాబట్టి తారక్ హోస్టింగ్ నాకు తెలియదు. ఇక నాని, నాగార్జున గారి హోస్టింగ్స్ లో నాకు నాని గారిదే బెటర్ అనిపించింది. ఐ లైక్ నాని హోస్టింగ్ ” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.