” కొత్త ఏడాదిలో పవన్ కళ్యాణ్‌కి మళ్లీ విడాకులు తప్పవు “.. వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎప్పటికప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ట్రెండింగ్ లో ఉంటాడు. అలాగే వేణు స్వామి చెప్పింది ప్రతి ఒక్కటి నిజమేనని నమ్ముతుంటారు ప్రజలు. ఇక ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని పెళ్లికి ముందే చెప్పి ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఈయన చెప్పినట్లుగానే వారు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకోవడంతో జనాలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలుపెట్టారు.

ఇక అంతే కాదు కొందరు స్టార్ హీరోయిన్స్ ఆయనతో పలు పరిహారాల పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఇక ఇటీవల కేసీఆర్ తెలంగాణలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి అన్నారు. కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక దీంతో వేణు స్వామి నెట్టింట ట్రోల్స్ కి గురయ్యాడు. ఇక తాజాగా పలు విషయాలపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కాంట్రివర్సీకి గురవుతారు.

వాటన్నిటిని ఎదుర్కోవడం తప్పదు. ఆయనకు చెప్పేవారు లేక రాజకీయాలు చేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాగే 2024 లో మూడోసారి విడాకులు తీసుకుంటారు. ఆయన కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట వింటారు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోరు. కాబట్టి పవన్ మేల్కొని ఏం చేస్తే సీఎం అవుతారో? దాని గురించి ఆలోచించాలి. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారిలో నేనొకడిని. అది అర్థం చేసుకోకుండా పవన్ ఫ్యాన్స్ నన్ను ట్రోల్స్ చేస్తున్నారు ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.