కర్ణుడిగా పవన్ కళ్యాణ్.. మహాభారతంపై కామెంట్స్‌ చేసిన యంగ్ డైరెక్టర్..!

హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసమైన మహాభారతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహాభారతానికి సంబంధించిన అనేక తెలుగు సినిమాలు మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భారత దేశ దిగ్గజ దర్శకులు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతమే.

మహాభారతాన్ని సినిమాగా తీస్తే ఏ క్యారెక్టర్ లో ఎవరిని పెట్టాలో ఇప్పటికే రాజమౌళి కూడా ఓ అంచనాకు వచ్చారు. తాజాగా..” హనుమాన్ “డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరే కనుక మహాభారతం తీయాలనుకుంటే కర్ణుడి పాత్రలో ఎవర్ని పెడతారు అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి ప్రశాంత్ వర్మ సమాధానం ఇచ్చాడు.

” అందులో కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్ అయితే బాగా సెట్ అవుతారు. ఆయన యాక్టింగ్ కు ఆయన్ని కర్ణుడి కింద పెట్టవచ్చు ” అని తెలిపాడు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ వీడియో చూసిన పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.