తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య పిల్లలతో కలిసి స్వామికి మొక్కులు తీర్చేందుకు వెళ్లారు. ఇక ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు శ్రీకాంత్.
స్వామి ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లప్పుడూ మా పైన ఉండాలంటూ కోరుకున్నారు. అలాగే తాను నటించిన దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్ లో ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ కూడా తాము మంచి పాత్రలు చేయడం సంతోషంగా ఉంది అంటూ పేర్కొన్నారు.
అలాగే శ్రీకాంత్ కుమారుడు రోషన్ మాట్లాడుతూ ప్రస్తుతం వైజయంతి పతాకంపై ” ఛాంపియన్ ” అనే సినిమా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తాను చేస్తున్న మరికొన్ని సినిమాలు త్వరలోనే వెలుగులోకి తీసుకొస్తానంటూ వెల్లడించాడు. ఇక ప్రస్తుతం వీరు శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.