యష్ ” టాక్సిక్ ” సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇక సినిమా పక్క హిట్ అంటున్న ఫ్యాన్స్..!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన యెష్ ప్రస్తుతం ” టాక్సిక్ ” అనే సినిమా లో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.

మలియాళ్ దర్శకుడు గీత మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన ఈ మూవీ కేవలం టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ భారీ సినిమాపై లేటెస్ట్గా వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఈ వార్తపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాని కేజిఎఫ్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లోని ఈ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక ఈ వార్త విన్న ప్రేక్షకులు..” కరీనానే కనుక ఈ సినిమాలో నటిస్తే మీ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆమె పేరు అలాంటిది మరి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.