భయంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ఆ మూవీ.. ఏంటి బాసు ఇది..!

రానున్న సంక్రాంతి పండగ బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడనున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ పోటీని ఎదుర్కొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు మరియు డైరెక్టర్లు కూడా. ప్రతి ఏడాది సంక్రాంతి అంటేనే సినిమా జోరు అనేటట్టు ఉండేది.

కానీ ఈ ఏడాది మాత్రం తమ సినిమాలని పర్సనల్గా తీసుకుంటున్నారు డైరెక్టర్లు. ఈ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం తో, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగిల్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలతో పోటీ పడనున్నారు.

అయితే ఇందులో ఒకటి లేదా రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సంక్రాంతి బరిలో నుంచి ఒక సినిమా తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు రవితేజ హీరోగా నటించిన ఈగిల్. సంక్రాంతి రేస్ ని తట్టుకోలేక ఎక్కడ దెబ్బతింటారో అనే భయంతో మేకర్స్ వెనక్కి తగ్గారట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.