” నా సామిరంగ ” నుంచి రిలీజ్ అయిన హీరోయిన్ మిర్నా ఫస్ట్ లుక్.. సూపర్ ఉంది అంటున్న ఫ్యాన్స్…!

అక్కినేని నాగార్జున హీరోగా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” నా సామి రంగ “. 2019లో రిలీజ్ అయిన సూపర్ హిట్ తమిళ్ మూవీ పొరింజు మరియం జోస్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్లూరి గ్రాండ్గా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ఈ సినిమాకి ప్రధానమైన వారిలో ఒకరైన యువ నటి మిర్నా ఫస్ట్ లుక్ పోస్టర్ని కొద్దిసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మంగ పాత్రలో కనిపించనుంది. ఇక అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.