ఒకే ఫ్రేమ్ లో సూపర్ స్టార్, పవర్ స్టార్… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటున్న ఫ్యాన్స్..!

సాధారణంగా ఒక స్టార్ హీరో ఒక ఫ్రేమ్లో కనబడితేనే పుకార్లు షికారు చేస్తాయి. అదే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఇంకే రేంజ్ లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మనకి ఎంతలా ఉపయోగపడుతుందో తెలిసిందే.

ఈ సోషల్ మీడియా తోనే ఒకే ఫ్రేమ్లో సూపర్ స్టార్ మరియు పవర్ స్టార్ ని యాడ్ చేసి మాస్ మసాలా లాగా చూపించారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమా నుంచి విడుదలైన కుర్చీ సాంగ్లో మహేష్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక సూపర్ స్టార్ లుక్ తో పాటు పవర్ స్టార్ గబ్బర్ సింగ్ మూవీ లుక్ ని తీసుకుని యాడ్ చేసి ఒకే ఫ్రేమ్ లో చూపించారు తమ అభిమానులు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోని చూసిన ప్రేక్షకులు..” యాడ్ చేస్తే చేశావు కానీ బ్రో ఏముంది. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి నిజంగా కేక బాసు నువ్వు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ” అంటూ ఎడిట్ చేసినోడిని తెగ పొగిడేస్తున్నారు ప్రేక్షకులు.