చిన్నోడే ఎక్కువ‌ లాక్కున్నాడు.. గుంటూరు కారం రిలీజ్ పై వెంకీ మామ ఫన్నీ కామెంట్స్..

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక,నిర్మాతలు కూడా అసలు ఆలోచించడం లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

Saindhav new poster : r/tollywood

ఈ నేపథ్యంలో సంక్రాంతికి చిన్నోడు, పెద్దోడు మ‌ధ్య‌ గట్టి పోటీ నెలకొంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. మ‌హేష్‌ గుంటూరు కారం 12వ తేదీ రిలీజ్ అవుతుండగా.. వెంకీ మామ సైంధవ్‌ సినిమా 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సైంధ‌వ్‌ మూవీ మేకర్స్ అంతా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లంచ్ ఈవెంట్లో వెంకటేష్ మీడియా సన్నివేశంలో మాట్లాడాడు.

Saindhav Movie Team With Media At Trailer Launch Event #saindhav #venkatesh  - YouTube

ఇందులో భాగంగా థియేటర్ల‌ కౌంట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చిన్నోడు సినిమాకి ఎక్కువ థియేటర్లు వెళాయి దీనిపై మీ స్పంద‌న‌ ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు వెంకీ మామ ఫన్నీగా సమాధానం చెప్పాడు. చిన్నోడు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పిన వెంకీ మామ‌ మాకు కేటాయించిన థియేటర్లలోనే మా సినిమాలు రిలీజ్ చేస్తామని.. ప్రేక్షకులు అక్కడికి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేస్తారని వివరించాడు. ఇక ప్రేక్షకులందరికీ కర్ఛీఫ్ వేసుకుని కూర్చోండిఅంటూ తమ సినిమా రిలీజ్ పై ఫన్నీ కామెంట్లు చేశాడు.