నాగ్ ” నా సామి రంగ ” మూడవ సాంగ్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే..!

కింగ్ నాగార్జున హీరోగా తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాలో రాజ్ తరుణ్ మరియు అల్లరి నరేష్, ఆశికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ లేటెస్ట్ యాక్షన్ మూవీ పై నాగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందునున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా మూడవ సాంగ్ ని ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక చిన్న వీడియో బైట్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక మరికొన్ని నిమిషాల్లో ఈ సినిమా నుంచి త్రాడ్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.