గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్.. రన్ టైం ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మాస్ యాక్షన్ డ్రామాగా గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బారిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబో దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హారిక అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తుంది. మరోవైపు రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తాజాగా సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ అందింది. 12 ఏళ్లలోపు పిల్లలు.. పేరెంట్స్ గైడ్లైన్స్ తో గుంటూరు కారం సినిమాను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవడంతో ప్రమోషన్స్ మరింత జోరు పెంచారు మేకర్స్. ఇప్పటివరకు గ్లింప్స్‌, సాంగ్స్ మాత్రమే సినిమా నుంచి రిలీజ్ అయ్యాయి. కాగా నెక్స్ట్ రాబోయే టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే 2:42 నిమిషాల నడివి ఉండబోతుందని తెలుస్తోంది. ఇక మూవీ లాస్ట్ 45 మినిట్స్ వేరే లెవెల్ లో ఉండబోతుందని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ వివరించాడు.

Guntur Kaaram: Meenakshi Chaudhary finally spotted!

యంగ్ ఎన‌ర్జిటిక్ బ్యూటీ శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే కుర్చీ మడత పెట్టి సాంగ్ తో వీరిద్దరూ మాస్‌ స్టెప్పులతో అదరగొట్టారు. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా మీనాక్షి, మహేష్ ఉన్న న్యూ లుక్ పోస్టర్ కూడా రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మహేష్ నుంచి సినిమా రిలీజై ఏడాదిన్నర అవ్వడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.