ఆ హీరోను హగ్ చేసుకున్నానని రజనీకాంత్ నాపై ఫైర్ అయ్యారు.. రంభ సెన్సేషనల్ కామెంట్స్

సీనియర్ స్టార్ బ్యూటీ రంభకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ‌ గుండెలను కాజేసి.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ తెలుగు కుర్రాళ్లకు మాత్రం కళ్ళ ముందు కనిపించే ఈ రంభ‌నే రంభ అని ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో అప్పట్లో ఈమె క్రేజ్ ఉండేది. ఇక పాన్ ఇండియా హీరోయిన్‌గా తన స్టామినా ఏంటో కూడా అప్పట్లోనే నిరూపించుకున్న స్టార్ బ్యూటీ రంభ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ప్ర‌య‌త్నంలో ఉంది.

రజనీకాంత్‌పై 'రంభ' వైరల్‌ కామెంట్లు.. ఇంటర్నెట్‌లో వివాదం! | Actress Rambha Viral Comments On Rajinikanth - Sakshi

ఇక రంభ రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. రజినీకాంత్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంది. నేను అరుణాచలంలో రజనీకాంత్ సార్ తో కలిసి షూటింగ్ జరుపుకుంటున్న టైంలో హిందీలో సల్మాన్ ఖాన్ బాంధన్ మూవీ కూడా చేయాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి కావడంతో.. మధ్యాహ్నం వరకు అరుణాచలంలో, మధ్యాహ్నం నుంచి బాంధన్ సెట్స్ లో షూటింగ్ కు పాల్గొనాల్సి వచ్చింది.

Remember 'Judwaa' actor Rambha? Here's how Salman Khan's co-star looks now

అయితే రెండు సినిమాల షూటింగ్ సెట్స్ పక్క పక్కనే కావడంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి అనుకోకుండా ఓ సంఘటన జరిగిందని.. ఇప్పటికీ అది నాకు గుర్తుంది అంటూ వివరించింది. హీరో సల్మాన్ అరుణాచలం మూవీ సెట్స్ కి వచ్చాడు. అలా ఆయన చూడగానే వెంటనే వెళ్లి హగ్ చేసుకుని పలకరించా.. దాన్ని రజనీకాంత్ సార్ చూసి డైరెక్టర్ సుందర్.సి గారితో ఏదో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత రజిని సార్ వచ్చి టవల్ విసిరి కొట్టి నాతో కోపంగా మాట్లాడారు. కెమెరామెన్ వచ్చి మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది అని మాట్లాడ‌డు అంటూ వివ‌రించింది.

Arunachalam to Kadhalukku Mariyadhai: 1997 witnessed many huge hits in Tamil cinema

రజిని సార్ మీతో కలిసి పనిచేయన‌ని అంటున్నారు అని వివరించాడు. దీంతో నేను ఏడవడం స్టార్ట్ చేశా. అప్పుడు రజిని సార్ వచ్చి ఎవరు ఈ అమ్మాయిని ఏడిపించింది అని ఫైర్ అయ్యారు. అసలు ఏం జరిగింది నేనేం తప్పు చేశాను అని నేను రజనీ సార్ ని అడిగా.. ఉదయం సల్మాన్ ను హాగ్ చేసుకున్నది ప్రాక్టికల్ గా చూపించి బాలీవుడ్ హీరో అయితే హగ్ చేసుకుంటావ్‌.. మాకైతే షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి వెళ్లిపోతావ్ అంటూ ఆటపట్టించారు. కానీ ఇదంతా ముందే సెట్ లో వాళ్ళందరికీ తెలుసు వాళ్లు కూడా కావాలనే నన్ను ఆటపట్టించారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక‌ రంభ షేర్ చేసుకునే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.