సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ ఈగిల్’ .. మాస్ మహారాజ్ ఈ సినిమాతో హిట్ కొట్టనున్నాడా..?!

మాస్ మహారాజ్ రవితేజకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ప్రస్తుతం రూ.25 కోట్ల రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రవితేజ ఈగిల్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి క‌ట్స్‌ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ అందించిన‌ సెన్సార్ బోర్డ్ సభ్యులు.. సినిమా గురించి పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది.

Eagle trailer released: Ravi Teja plays a wanted man on a mission -  Hindustan Times

ట్రైలర్ లో యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమాలో రవితేజ ఫాన్స్ కోరుకునే అన్ని అంశాలు కూడా ఉన్నాయట. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత మళ్లీ రవితేజకు ఆరెంజ్ హిట్ ప‌డ‌లేదు. ప్రస్తుతం అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పడుతుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. రవితేజ ఈ సినిమాలో రెండు షేడ్లలో నటించబోతున్నాడని స‌మాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

Eagle Movie Out Of Sankranthi Race? Clarity Here

ఇక గతంలో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్‌ సూర్య సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో యావరేజ్ రిజల్ట్‌ అందుకున్నాడు. అయితే ఈగిల్ సినిమాతో మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ సొంతం చేసుకుంటాన‌నే నమ్మకంతో ఉన్నారు. మేకర్స్ ఈగిల్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని గ‌త‌ కొంతకాలంగా ప్రచారం జోరుగా సాగుతుంది.ఇక ఈ మూవీ రిలీజ్ డేట్‌లో ఏవైనా మార్పులు వ‌స్తాయేమో చూడాలి. ఏదిఏమైనా రవితేజ ఈగిల్ మూవీ తో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద రికార్డ్ సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.