పాలు ఎక్కువ తాగితే మంచిదా? కాదా?.. ఈ సందేహం మీలో కూడా ఉందా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ పాలు తాగుతూ ఉంటారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజు ఒక గ్లాస్ పాలు తాగితే మంచిది అంటుంటారు నిపుణులు. పాలు హెల్త్ కు మంచిదని కొంతమంది ఎక్కువగా తాగుతారు. కానీ పాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

రోజు మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు తాగితే పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందట. కడుపులో ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు కలుగుతాయట. పాలు ఎక్కువగా తాగితే అలర్జీలు, మొటిమలు లాంటి చర్మ సమస్యలు సైతం ఏర్పడతాయి.

అలాగే పాలు ఎక్కువగా తాగితే మెదడు మబ్బుగా మరి జ్ఞాపకశక్తి తగ్గుతుందట. అలాగే పాలు ఎక్కువగా తీసుకుంటే హార్మోన్స్ అసమంతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిరోజు కేవలం రెండు గ్లాసులు వరకే పాలు తాగడం మంచిది. లేదంటే జబ్బులను కొని తెచ్చుకున్న వారు అవుతారు.