అందరూ నా కళ్ళు బాగున్నాయి అంటారు.. కానీ చూసేది మాత్రం అక్కడ.. ఎన్టీఆర్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో న‌టించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతలో తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా గ్లామర్ మెయింటైన్ చేయాలన్న విషయం చిన్న వయసులోనే తెలుసుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో దర్శక,నిర్మాతల కంట పడుతూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా సందడిచెస్తూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా తన సోదరి ఖుషి కపూర్ తో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రియాలిటీ గేమ్ షో.. కాఫీ విత్ కరణ్‌ షోలో సందడి చేసింది. ఈ షోలో తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల‌ను షేర్ చేసుకున్న జాన్వి.. తన తల్లి చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డామని.. ఖుషి నన్ను చూసి తను వెంటనే కళ్ళు తుడుచుకొని నన్ను ఓదార్చడం మొదలుపెట్టిందంటూ చెప్పుకొచ్చింది.

అలాగే తన స్పీడ్ డైల్ లిస్టులో ఉన్న ముగ్గురు పేర్లు అడ‌గ‌గానే తండ్రి, చెల్లి పేరుతో పాటు లవర్ పేరు కూడా ఫ్లోలో బయట పెట్టేసింది. అయితే ఇటీవల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. ఇక ఈ షోలో జాన్వి రెడ్ హాట్ డ్రస్ లో ఎద సొగసులు ఒప్పొంగే లో ఎక్స్పోజింగ్ చేస్తూ కుర్రాళ‌ను ఆకట్టుకుంది. ఇక ఈ షోలో తన బాడీ పై జాన్వి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందరూ నా కళ్ళు బాగున్నాయని చెబుతారు. కానీ వారు చూసేది మాత్రం బాడీలో వేరే పార్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.