బేబీ బ్యూటీని పట్టేసిన టిల్లు గాడు.. చూపుల‌తోనే కుర్ర‌ళ్ళను క‌విస్తుందే..

ప్రముఖ యూట్యూబర్‌ షార్ట్ ఫిలిం ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయిరాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బేబీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక‌ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది వైష్ణవి చైతన్య.

ఇప్పటికే దిల్ రాజు బ్యానర్లో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బీవీఎస్ఎస్ ప్రసాద్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ మూవీలో హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ అమ్మడి న్యూ లుక్ పోస్టర్ను యూనిట్ సభ్యులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

పోస్టర్‌లో వైష్ణవి లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్లాక్ డ్రెస్, బ్లాక్ దుప్పట తలకు చుట్టుకొని ఎంతో పద్ధతిగా ఉన్న ముస్లిం అమ్మాయిల కనిపిస్తుంది. ఈ రేంజ్ లో అందరిని మూట కట్టిన వైష్ణవి చైతన్య కచ్చితంగా సిద్దు జొన్నలగడ్డకి ఈ సినిమాతో సక్సెస్ తెచ్చి పెడుతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. టిల్లు గాడి లక్కే లక్కు ఏకంగా ఇంత అందాన్ని కొట్టేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.