చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో విముక్తి పొందండి..!

ప్రతి ఒక్కరికి తమ పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని సమస్యలు కారణంగా మన జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చుండ్రు సమస్య ఒకటి. చుండ్రు సమస్య ఏర్పడితే జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది.

ఇక ఈ సమస్యని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏ విధమైన ఫలితం కలగదు. చుండ్రు అనేది ఈస్ట్ చెందిన ఒక ఫంగస్. దీనిని సాధారణంగా మలాసెజియా అని పిలుస్తారు. కెమికల్ షాంపులు ఉపయోగించడం వల్ల ఫంగల్ ల‌ ఏర్పడుతుంది. ఇక దీనిని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

జుట్టును సాధారణంగా ఉండే కుంకుడు కాయలతో శుభ్రం చేసి అనంతరం వేప లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం ద్వారా చుండ్రు సమస్య పోతుంది. అలాగే ఉల్లిపాయను జుట్టు, మెదడుకు పట్టించి అరగంట పాటు ఉంచి క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా చుండ్రు సమస్య పోతుంది. ఈ సింపుల్ టిప్స్ వాడి చుండ్రు సమస్యతో బాధపడేవారు విముక్తి పొందండి.