అఫీషియల్: హనుమాన్ కోసం రంగంలోకి దిగనున్న మెగాస్టార్..

యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సర్జా హీరోగా.. యంగ్ బ్యూటీ అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా నటించిన మూవీ హనుమాన్. యంగ్ అండ్‌ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. చిన్న సినిమా అయినా కంటెంట్ ఏదో ఉండడంతోనే స్టార్ హీరోల‌ సినిమాలకు పోటీగా వస్తుందంటూ ప్రేక్షకులంతా ఈ సినిమాపై అంచనాలను పెంచుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌ గా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇక సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ కూడా ఉంద‌ని టాక్‌. ప్రస్తుతానికి ఈ సినిమాలో మెగాస్టార్ ప్రజెన్స్ ఉందో లేదా అనేది సస్పెన్స్ గా ఉన్న.. సినిమా కోసం మెగాస్టార్ ఎంట్రీ మాత్రం కన్ఫామ్ అయిపోయింది. మెగాస్టార్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.

జనవరి 7న గ్రాండ్గా జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ వచ్చి సందడి చేయబోతున్నాడ‌ని. చిరంజీవి ఆగమనం ఫిక్స్ అయిపోయిందని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. మరి ఈ ఈవెంట్ హలో మెగాస్టార్ సందడి చేయడం అంటే సినిమాకు మ‌రింత హైప్‌ తెచ్చి పెట్టినట్లే. ఇక ఈ ఈవెంట్‌లో చిరంజీవి ఇంకెన్ని విషయాలు షేర్ చేసుకుంటాడో అనే ఆశ‌క్తి ఫాన్స్ లో మొదలైపోయింది.