బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. ఎస్‌కేఎన్‌ తండ్రి శ్రీ గద్దె సూర్య ప్రకాష్ రావు గారు ఈరోజు ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతు మరణించినట్లు సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్‌ కుటుంబాని పరామర్శించడానికి అక్కడికి చేరుకున్నారు.

ఈ రోజు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంతక్రియలు జరగబోతున్నాయని ఎస్‌కేఎన్ ఫ్యామిలి వెల్ల‌డించారు. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎస్‌కేఎన్‌ మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్ గా, త‌ర్వాత‌ పిఆర్ఓ గా ఇండస్ట్రీలో తన జర్నీని ప్రారంభించాడు.

తర్వాత అల్లు అరవింద్ కుటుంబంతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యంతొ నిర్మాతగా మారాడు. దీంతో పలు హిట్ సినిమాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడైన.. డైరెక్టర్ సాయిరాజేష్‌తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించాడు. అతి చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సా ఫ‌సీ వ‌ద్ద‌ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.