నీహారిక విడాకుల ఇంటర్వ్యూ పై మాజీ భర్త సంచలన కామెంట్స్.. అడిగి కడిగి పాడేశాడుగా..!!

మెగా డాటర్ ..నిహారిక మళ్లీ పెంట్ పెంట చేసేసుకుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . కొనిదెల నాగబాబు కూతురు నిహారిక రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన కామెంట్స్ చేసింది . తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడిపోవడానికి కారణమేంటో పరోక్షకంగా రివీల్ చేసింది . “అంతేకాదు పెళ్లి తర్వాత లైఫ్ మనం అనుకున్నట్లు ఉండదు .. మనుషులు మనకు నచ్చినట్లు ఉండరు అని నాకు అప్పుడే తెలిసింది . అందుకే పెళ్లి అయిన ఏడాదిలోపే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ సంచలన కామెంట్స్ చేసింది .

అయితే దీనిపై రీసెంట్గా నిహారిక మాజీ జొన్నలగడ్డ చైతన్య షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు . ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండే జొన్నలగడ్డ చైతన్య ఈసారి డైరెక్ట్ గా హోస్ట్ నిఖిల్ ని ట్యాగ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు . జొన్నలగడ్డ చైతన్య రాసుకోస్తూ..” హలో నిఖిల్.. నిహారిక ఎదుర్కొంటున్న పరిస్థితిని తగ్గించడానికి మీరు చేసిన ప్రయత్నానికి చాలా చాలా ధన్యవాదాలు.. వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టడం మీ ప్రచారాలతో వ్యవహరించడం అంత సులభం కాదు అని నాకు బాగా తెలుసు ..విడాకుల విషయంలో ఎవరినైనా సరే ఇద్దరి ఆలోచనలు ఇద్దరి నిర్ణయాలు తీసుకోవాలి”..

” ఇలా ఒకరిన ట్యాగ్ చేయించి తప్పు పట్టడం సమంజసం కాదు . ఇది మొదటిసారి కాదు ఇలా జరగడం రెండోసారి .. విడాకుల గురించి ఒకరి వైపే మాట్లాడకండి.. ఆ బాధ రెండు వైపులా ఉంటుంది ..ఈ బాధ నుంచి ఎలా కోలుకోవాలో మాట్లాడితే అందరికీ ఉపయోగపడుతుంది.. ఏం జరిగిందో తెలియకుండా తీర్పు ఇవ్వడం కూడా పెద్ద తప్పు ..అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ కామెంట్ చేశాడు. దీనితో సోషల్ మీడియాలో జొన్నలగడ్డ చైతన్య పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది..!!