‘ స్పిరిట్ ‘ సినిమాలో నటించనున్న ఆ బాలీవుడ్ హీరో.. సందీప్ రెడ్డి వంగ క్లారిటీ..

సినీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిస‌లు శ్ర‌మిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతారు. ఇక టాలీవుడ్ లో అలానే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపులో సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందట‌.

Official: Prabhas 25 titled Spirit! Sandeep Reddy Vanga to direct! "Telugu  Movies, Music, Reviews and Latest News"

ఈ సినిమాలో మరొక హీరో నటించే అవకాశాలు కూడా ఉంద‌నితెలుస్తుంది. స్పిరిట్‌తో సందీప్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్త‌ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ని రీ చెక్ చేసుకుంటూ పనిచేస్తున్నాడు. మొత్తానికి స్పిరిట్ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోని కూడా కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద సందీప్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ప్రభాస్ కానీ.. సందీప్ రెడ్డి వంగ కానీ.. ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా కొంతమంది దీనిపై సందీప్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Vanga Reveals Who His First Option Was! | Sandeep Vanga Reveals Who  His First Option

మరి కొంతమంది సినీ మేధావులు ఇలాంటి న్యూస్‌లు స్వయంగా మేకర్ చెబితే కానీ నమ్మకండి అంటూ వివరిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కడం.. అది కూడా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరో కావడంతో.. సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం రాజా సాబ్, కల్కి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్స్‌ పూర్తయిన వెంటనే స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడట.