ఓరి దేవుడోయ్.. కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు.. ఆవిషయంలో టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే..!

సాయి పల్లవి ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ఒక స్పెషల్ స్థానాన్ని దక్కించుకుంది. డాక్టర్ చదివినా సరే మలయాళం సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడంతో మల్లర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . ఆ తర్వాత తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది.

సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించడం ప్రారంభించింది . కేవలం హీరోయిన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ లోనే పనికి వస్తారు అన్న అపోహా నుండి హీరోయిన్స్ కూడా నటించగలరు అని ప్రూవ్ చేసింది సాయి పల్లవి . ఈమె చాలా చాలా చక్కగా ఉంటుంది. అందంగా ఉంటుంది.. అయినా సరే ఎక్స్పోజింగ్ చేయదు.. తాను నమ్మిన సూత్రాలను గట్టిగా ఫాలో అవుతుంది సాయి పల్లవి .

చాలా సింపుల్ సిటీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే సాయి పల్లవి నే కాదు టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే అంటూ రీసెంట్గా తన చెల్లి నిశ్చితార్థంలో బయటపడింది . అంత ఆస్తి ఉన్న కూడా నిశ్చితార్థం రోజు చాలా సింపుల్ లుక్స్ లో కనిపించి సాయి పల్లవి కుటుంబం అభిమానులను ఆకట్టుకునింది. దీనితో సోషల్ మీడియాలో వాళ్లకు సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి..!!