హమ్మయ్య.. శ్రీలీలకి ఆ విషయంలో ఇప్పటికి బల్బ్ వెలిగిందా.. ఇక మంచి రోజులే..!!

శ్రీ లీల .. నిన్న మొన్నటి వరకు ఈమె ఓ మహారాణిలా చూసుకున్నారు ఇండస్ట్రీ జనాలు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమెకు అంత సీన్ లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు . శ్రీలీల నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే ఇందుకు కారణం. ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మంటున్నాయి . దీంతో శ్రీ లీల పేరు కూడా ఢమాల్ అంటూ పడిపోతుంది . ఈ క్రమంలోనే శ్రీ లీల సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .

కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుందట . అంతేకాదు కేవలం స్టార్ హీరో సినిమాలే కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చూస్ చేసుకోవాలని డిసైడ్ అయిందట . అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ పెట్టబోతుంది అన్న వార్తలు ఎటువంటి నిజం లేదు అంటూ తేల్చేసింది . ఇకపై శ్రీలీల నుంచి వచ్చే సినిమాలు అన్ని అభిమానులను ఆకట్టుకునే విధంగానే ఉండబోతున్నాయి అంటూ క్లారిటీకొచ్చేసింది.

ప్రజెంట్ శ్రీ లీల చేతుల్లో పదికి పైగానే సినిమాలు ఉన్నాయి. అందరూ కూడా బడాబడా హీరోలే కావడం గమనార్హం . కచ్చితంగా ఈ పది సినిమాలలో ఐదు హిట్ అవ్వడం కన్ఫామ్ .. ఈ ఐదు సినిమాలు హిట్ అయితే శ్రీ లీల పరిస్థితి ఎంత మారిపోతుందో మనకు తెలిసిందే. ఆమె రీసెంట్ గా నటించిన సినిమా గుంటూరు కారం . ప్రసెంట్ శ్రీలీల పలు సినిమా షూట్స్ లో బిజీ గా ఉంది..!!