మెగా ఫ్యామిలీ నా మజాకా.. మెగా హీరోలు ఏకంగా ఎన్ని అవార్డులు దక్కించుకున్నారంటే..?!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎంతో మంది పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే మెగాస్టార్ బ్యాక్గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను తమ ఖాతాలో ఎన్నో అవార్డులను దక్కించుకున్న మెగా హీరోలు ఉన్నారు. వాళెవ‌రో ఇప్పుడు చూద్దాం. మొదట సీనియర్ హీరో చిరంజీవి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్‌గా పాపుల‌ర్ అయ్యారు. అయితే చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు.

Brothers in arms to arch-rivals: What went wrong with Pawan Kalyan,  Chiranjeevi

ఏడు సూత్ ఫిలింఫేర్ అవార్డులను, మూడు నంది అవార్డులను, రఘుపతి వెంకయ్య పురస్కారం.. వాటితో పాటు ఫిలిం అచీవ్మెంట్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న మెగాస్టార్.. 2006లో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇక తాజాగా 18 ఏళ్ల గ్యాప్ తో పద్మ విభీషణ్‌ను కూడా చిరంజీవి దక్కించుకొని రికార్డును క్రియేట్ చేశాడు. అయితే మెగా సినీ బ్యాగ్రౌండ్ తో మెగాస్టార్ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ కూడా ఇప్పటికే రెండు నంది అవార్డులు పాప్ గోల్డెన్ అవార్డ్,సైమా అవార్డు కూడా వచ్చాయి. చిరు తరువాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్.

తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ కూడా.. ఫిలింఫేర్ అవార్డులతో పాటు నంది అవార్డులను దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ టాలెంట్ కు సైమా అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. చరణ్ భార్య ఉపాసనకు తను అందిస్తున్న సేవలకు మహాత్మా గాంధీ అవార్డును దక్కించుకుంది. ఇక అదే విధంగా మెగా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ కూడా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డుతో పాటు ఐదు నంది అవార్డులను దక్కించుకున్నాడు.

Nasty fan war erupts between fans of Allu Arjun, Ram Charan - Telugu News -  IndiaGlitz.com

ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా ఎన్నో అవార్డులను అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కొంతమంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంత మంది మెగా ఫ్యామిలీ నా మజాకా ఈ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఇతర భాషల్లో కూడా మెగాస్టార్ మంచి పాపులర్ కి దక్కించుకున్నాడు.