“నేను సింగిల్ కాదు”.. రెండో పెళ్లి పై నీహారిక సంచలన కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..!!

నీహారిక .. ప్రెసెంట్ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు నిహారిక డివోర్స్ తీసుకున్న ఇష్యూ పై బాగానే వార్తలు వినిపించాయి . అయితే తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులు తీసుకోవడానికి కారణం పై రెస్పాండ్ అయ్యి తన పేరుని మరింత స్థాయిలో ట్రోలింగ్కి గురయ్యేలా చేసుకునింది .

జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ పరోక్షంగా ప్రకటించిన నిహారిక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగా నిహారిక చేసిన కామెంట్స్ పై మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య సైతం ఫైర్ అయ్యాడు . విడాకులపై నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అంటూ సలహా ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ..” నేను సింగిల్ కాదు అని విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని.. నేను నా తల్లిదండ్రులతో ఉంటున్నాను వాళ్లను చూసుకుంటున్నాను ..సో నేను ఎప్పటికీ సింగిల్ కాదు ..

నాకు మా అమ్మ, నాన్న , అన్న , వదిన ఎప్పుడూ తోడుగా ఉంటారు ” అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది. ఈ క్రమంలోనే గతంలో నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుంది అని వచ్చిన వార్తలు ఫేక్ అంటూ తెలిసిపోయాయి . అయితే నిహారిక లైఫ్ లాంగ్ ఇలా సింగిల్గానే ఉండిపోతుందా అన్న విషయం ఇప్పుడు మెగా ఫాన్స్ కు హార్ట్స్ బ్రేక్ అయ్యేలా చేస్తున్నాయి..!!