ఏకంగా ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర జగతి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి రాయ్‌కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు రియల్ లైఫ్ లో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. హాట్ అందాలు ఆరబోస్తూ కుర్ర కారకు పిచ్చెక్కించే విధంగా జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది. అంతేకాదు ఓ యంగ్ డైరెక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఇటీవల ప్రకటించి సంచలనం సృష్టించింది.

అలాగే అతని పేరును తన పేరులో కలుపుకొని ట్విట్టర్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఘాటు అందాలతో కుర్రాలకు కైపెక్కిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె క్యారెక్టర్ ముగిసింది. కాగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న జ్యోతి రామ్‌.. త‌న ఇన్‌స్టా స్టోరీ లో ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేసుకుంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో ఉన్న ఫోటో షేర్ చేసింది. దీంతో అది చూసిన జ‌నం అంతా ఎన్టీఆర్ 31 సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చిందేమో అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిరాయ్‌ పోస్ట్ నిట్టింట‌ వైరల్ అవడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ నిజంగానే జ్యోతి రాయ్‌కు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వచ్చినట్లయితే ఆమె బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే.