నా పేరు వాడుకొని మోసం చేస్తున్నారు.. దయచేసి నమ్మవద్దు.. సోను సూద్ సెన్సేషనల్ పోస్ట్..

Sonu Sood

రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. కొందరు ఆకతాయిలు హీరోయిన్స్ డీప్ఫ‌ఖ్ వీడియోలను క్రియేట్ చేసి రాక్షసానందం పొందుతుంటే.. మరికొందరు సెలబ్రిటీల యొక్క ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒకచోట సైబర్ నేరగాళ్లు తమ ప‌ళ‌ని తనం చూపిస్తూనే ఉన్నారు.

కొన్ని నెలల క్రితం నెట్టింటి వైర‌ల్ అయిన‌ రష్మిక మందన డిప్‌ఫేక్‌ వీడియో ఏ రేంజ్ లో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా సోను సూద్‌ మంచి పేరును వాడుకొని ఎలాగైనా డబ్బులు దండుకోవాలని ఉద్దేశంతో సైబర్ నెరగాళ్లు ఈ డిప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనూ సూద్ వివరించాడు. డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ తో తన ఫేస్ ను వాడుకొని.. వీడియో కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారని తెలిసింది.

ఎవరు కూడా వీటికి స్పందించవద్దు.. దయచేసి ఎవరూ డబ్బులు ఇవ్వవద్దు అంటూ సోను సూద్ వివరించాడు. తన పేరును వాడుకొని ఇలా మోసాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నానంటూ చెప్పుకొచ్చాడు. కరోనా టైంలో రియల్ హీరోగా ఎంతో మందికి సహాయం చేసి మంచి పేరును సంపాదించుకున్న సోనూసూద్ మంచితనాన్ని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అక్కడ ఉన్నది నిజంగా సోను సూద్‌ అని నమ్మి వారికి డబ్బులు ఇచ్చారట.