రామ్ చరణ్ పక్కన నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ చరణ్ మొదటి చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. మగధీర సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక అప్పటివరకు తాను చేసిన రెండో సినిమాతోనే ఆ రేంజ్ లో రికార్డులు ఏ హీరో కూడా క్రియేట్ చేయలేకపోయాడు. కానీ రామ్ చరణ్ కు అది సాధ్యమైంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇలాంటి క్రమంలో ఒకప్పుడు అమితాబచ్చన్ నటించిన జంజీర్ సినిమాని టాలీవుడ్ లో తుఫాన్ సినిమాతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు.

Toofan (2013) - Photo Gallery - IMDb

ఈ సినిమా బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా టైంలో బాలీవుడ్ కి చెందిన దీపిక పదుకొనేను హీరోయిన్గా నటించమని అడిగారట మేకర్స్. అయితే ఆమె సినిమాను రిజెక్ట్ చేసిందట. దాంతో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. కాగా రామ్ చరణ్ కి.. ప్రియాంక చోప్రా కు మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమాకు మైనస్ అయిందని ప్రేక్షకులు తెలియజేశారు.

List of awards and nominations received by Deepika Padukone - Wikipedia

ఇక మొత్తానికి ఈ సినిమా బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ డిజాస్టర్ గా నిలిచింది. అప్పటినుంచి మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ దీపికా పదుకొనే అంటే కాస్త కోపం ఉంటుందట. తమ అభిమాన హీరోయిన్ మెగా పవర్ స్టార్ సినిమాని ఆమె రిజెక్ట్ చేయడమే వారి కోపానికి కారణం. ఇక మొత్తానికి రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని జంజీర్ సినిమాతో వచ్చినప్పటికీ భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ చివరిగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో కూడా ఆయన జెండా ఎగరేశాడు. మొత్తానికి ఎక్కడైతే డిజాస్టర్ తో పడిపోయాడో అక్కడే మళ్ళీ బ్లాక్ బ్లాక్ బస్టర్ తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.