‘ హనుమాన్ ‘ మూవీ సమంత రివ్యూ.. సినిమాకు అది చాలా ముఖ్యం అంటూ..

తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ టాలీవుడ్ వద్ద ఎలాంటి సక్సెస్ తో దూసుకుపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా కొల్లగొట్టిన హనుమాన్ ఇప్పటికే ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో పాన్‌ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విజువల్స్, కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

It's a working birthday for Samantha Ruth Prabhu - The Daily Guardian

టాలీవుడ్ ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాపై వారి రివ్యూ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమా పై రియాక్ట్ అయింది. ప్రశంసలు కురిపించింది. మనకి మళ్లీ బాల్యాన్ని గుర్తు చేయగలిగే సినిమాలు చాలా ఉత్తమమైనవని.. అలా హనుమాన్ సినిమా ఉందని హనుమాన్ అద్భుతమైన విజువల్స్, మంచి కామెడీ తో పాటు, మ్యూజిక్ ఉన్నాయని చెప్పుకొచ్చిన శ్యామ్.. థాంక్యూ ప్రశాంత్ అంటూ డైరెక్టర్ ను ప్రశంసల వర్షం కురిపించింది.

Samantha Ruth Prabhu reviews HanuMan, praises Teja Sajja: 'You surprised  me' - Hindustan Times

మీ యూనివర్సల్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ సమంత రాసుకొచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన తేజ నటనను, కామిక్ టైమిక్ ను అద్భుతంగా ఉందంటూ మెచ్చుకుంది. ఓ సినిమాకు అది చాలా ముఖ్యమని వివరించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్యులేషన్స్ అంటూ సమంత శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక ప్రస్తుతం సమంత.. హనుమాన్ మూవీకి ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.