మొదటి సినిమా డైరెక్ష‌న్‌తోనే ఏకంగా 9 అవార్డులు గెలుచుకున్న ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్త..

టాలీవుడ్ ఇండస్ట్రీలో జెనీలియాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, ఢీ, సై, రెడీ లాంటి ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమాలలో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించిన ఈమె కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చేకేసిన జ‌నీలియా అక్క‌డ నటుడు రితేష్ దేశముఖ్‌ను ప్రేమించి 2011లో వివాహం చేసుకుని ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది.

Genelia D'Souza REVEALS Why She Left Acting After Marrying Riteish Deshmukh, Says 'I Wanted To...' - News18

అయితే ఆమెకు సౌత్‌లో ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎప్పుడెప్పుడు ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రీఎంట్రీ తో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జెనీలియా. 2022లో జెనీలియా వేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది ఇందులో ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించి మెప్పించాడు.

trailer: 'Ved' Trailer: Genelia D'Souza And Riteish Deshmukh Starrer 'Ved' Official Trailer | Entertainment - Times of India Videos

ఇక ఈ సినిమాకు దర్శకుడు కూడా జెనీలియా భర్త రితేష్ కావడం విశేషం. ఇది ఓ మరాఠీ సినిమాగా తెరకెక్కి.. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ముఖేష్ కు ఈ సినిమాకు ఏకంగా 9 అవార్డులు దక్కాయి. బెస్ట్ హీరోయిన్గా జెనీలియా కూడా అవార్డును అందుకుంది. నిజంగానే రితేష్‌కు ఇది చాలా గొప్ప విజయం అని చెప్పాలి. ఇక ఈ వేద్ సినిమా.. 2018లో తెలుగులో వచ్చిన మజిలీకి రీమేక్ గా తెరకెక్కింది.