వామ్మో.. ఆ స్టార్ హీరో అన్ని కోట్లు ట్యాక్స్ కడుతున్నాడా..? మన ఇండస్ట్రీ నుండి ఆయనే టాప్..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎంత హై రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోస్ అయితే ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు మధ్యలో రమ్యూనరేషన్ తీసుకుంటూ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసేస్తున్నారు. అయితే మన రామ్ చరణ్ మాత్రం చాలా తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 60 – 70 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు . అయితే ఆయన టోటల్ ఆస్తి మాత్రం 1375 కోట్లు అంటూ రీసెంట్గా వార్తలు బయటకు వచ్చాయి .

ఈ క్రమంలోనే సినిమాకి ఇంత తక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే చరణ్ కు అంత ఆస్తి ఎలా వచ్చిందా ..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు జనాలు . అయితే మెగా ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి తో పాటు చరణ్ విమానయాన సంస్థలలో పెట్టుబడులు పెట్టారని అవే కాకుండా .. పలు బిజినెస్ లో కూడా షేర్స్ ఉన్నాయని .. అదే విధంగా కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ద్వారా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు అని ..

ఆ విధంగా చరణ్ ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు పలు యాడ్స్ లో కూడా భాగం కావడం వల్ల చరణ్ కు సినిమాలో తక్కువ రెమ్యూనరేషన్ వచ్చిన బయట బాగానే వస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మన దేశంలో అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న వాళ్లలో రామ్ చరణ్ కూడా టాప్ టెన్ లో ఉన్నారట . దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాంచరణ్ ఎంత ట్యాక్స్ కడుతున్నాడో. అంతేకాదు ఆ టాప్ టెన్ లిస్టులలో నాగార్జున కూడా ఉండడం గమనార్హం..!!