ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

పైన ఫోటోలో బూరె బుగ్గలు వేసుకొని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. సౌత్‌ స్టార్ హీరోయిన్‌గా అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలో ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే చాలామంది హీరోలకు అదృష్ట దేవతగా మారిన ఈ బ్యూటీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. 2007లో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ అదే క్రేజ్ తో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది.

Kajal Agarwal Biography, Age, height, Weight, Size, Boyfriends, Family

కరోనా టైంలో వివాహం చేసుకొని కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె టాలీవుడ్ చందమామ.. కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కాజల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ 2009లో రామ్ చరణ్ సరసన మగధీరలో నటించి భారీ బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకుంది. కాజల్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇదే. ఈ సినిమా తరువాత టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించింది.

Kajal Aggarwal Enjoys a Perfect Vacation With Hubby Gautam In New York,  Drools Over Flavoursome Food

ఇక 2020లో తన క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ మాన్ అయినా గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని 2022లో నీల్‌కిచ్చ్‌లుకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల రీ ఎంటర్ ఇచ్చి బాలయ్య భగవంత్ కేసరిలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. బ్యూటీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెర‌కెక్కుతున్న ఇండియన్ 2 లో నటిస్తుంది. అదేవిధంగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలను నటిస్తోంది. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతుంది. అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్ తో ట్రీట్ ఇస్తూ ఉంటుంది.