ఆ మేటర్ లో శ్రీ లీలను చూసి నేర్చుకున్న మృణాల్ ఠాకూర్… మరీ అవి కూడానా…!

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమా రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇందులో వీరి నటనకు విమర్శలకు ప్రశంసలు అందుతున్నాయి.

ఇక ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది. ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. ఇక దీనిపై స్పందించిన మృణాల్ ఠాకూర్…” థాంక్యూ సో మచ్ స్వీట్ హార్ట్. నీకు సినిమా నచ్చినందుకు హ్యాపీగా ఉంది. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యా.

స్టడీ అండ్ వర్క్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లడం అంత ఈజీ కాదు ” అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఈమె థాంక్స్ పై మరోసారి శ్రీ లీల స్పందిస్తూ…” దట్ మీన్స్ ఎలాట్. యూ మేక్ మీ హ్యాపీ ” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం వీరిద్దర మధ్య నడిచిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ కంటే శ్రీ లీల చిన్నదైనప్పటికీ.. ఆమె దగ్గర అన్ని గొప్ప విషయాలు నేర్చుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.