నయనతార అన్నపూర్ణి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా.. ఎప్పుడంటే..?

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నయన్ ఇటీవల నటించినా తన 75వ మూవీ అన్నపూర్ణి డిసెంబర్ 1న తమిళ్లో గ్రాండ్ గాలి రిలీజ్ అయింది. చెఫ్‌ కావాలని కలలుకనే ఓ బ్రాహ్మణ అమ్మాయి కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. జవాన్ సక్సెస్ తర్వాత నయనతార హీరోయిన్గా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పూర్ స్టోరీ, స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాపై చెన్నై వరదల కారణంగా మరింత ప్రభావం ప‌డింది.

Annapoorani' trailer out: Nayanthara is torn between father's love and her  passion for cooking - India Today

దీంతో అన్నపూర్ణి డిజాస్టర్‌గా నిలిచింది. ఇక థియేటర్లో రిలీజై నెల రోజులు కూడా కాకముందే అన్నపూర్ణి సినిమా ఓటీటీలో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. థియేటర్లో రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను జి ఫై ద‌క్కించుకుందట. డిసెంబర్ 29న అన్నపూర్ణి ఆడియోస్ ముందుకు రానున్నట్లు టాక్. తమిళం తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అన్నపూర్ణి స్ట్రీమ్ అవుతుందని సమాచారం. ఇక ఈ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

Annapoorani box office collection Day 1 - Nayanthara starrer hit by poor  occupancy; earns ₹60 lakh

ఈ సినిమాలో హీరో జై, సత్యరాజ్‌లు కీలక పాత్రలో నటించారు. నయ‌న్‌ ఇందులో ఓ పూజారి కూతురు.. తండ్రి ద్వారా చిన్నతనం నుంచే వంటలపై ఆసక్తి ఏర్పరచుకున్న ఈ అమ్మాయిగా క‌నిపిస్తుంది. చెఫ్‌ కావాలని ఎన్నో కలలు కంటుంది. కానీ ఆమె కల‌లకు నాన్న అడ్డు చెప్పడంతో వాళ్లకి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్ (జై) చెఫ్‌ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి. ఆ తర్వాత ఆనంద్ సుందర్ రాజన్(స‌త్య రాజ్‌) సహాయంతో ఇండియన్ బెస్ట్ చెఫ్‌ కాంపిటీషన్లో అన్నపూర్ణి విన్ అవుతుంది.