ఈ ఏడాది లగ్జరీ కార్లు కొన్న ముద్దుగుమ్మల లిస్ట్ ఇదే.. వాటి కాస్ట్ తెలిస్తే ఫ్యుజ్‌లు ఎగిరిపోతాయి..!

ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఏ విషయం అయినా సరే ఫాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు తిరిగే లగ్జరీకార్లు, వారు ఉండే విలాసవంతమైన విల్లాల గురించి, సినిమాల గురించి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక మరికొద్ది రోజుల్లో 2023 ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లగ్జరీ కార్లు కొన్న స్టార్ హీరోయిన్ల లిస్ట్.. ఆ కార్ల వివరాలు ఓసారి చూద్దాం.

పూజా హెగ్డే :


సౌత్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు పూజ హెగ్డే తన అందం, అభినయంతో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానాని సంపాదించుకుంది. 2023లో ఈ బ్యూటీ ఏకంగా రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్ యు వి కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలియా భట్ :


రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అలియాభట్ దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. గంగుబాయి సినిమాకు బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా ఈ ఏడాది ఓ కొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్ బేస్ ఎస్‌యువి కారును సొంతం చేసుకుంది. ఈ కారు ఖరీదు మూడున్నర కోట్లు ఉంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్ :


టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఏడాది ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. ఈ కారు షోరూం సిబ్బంది ట్రాక్‌లో ఆమె ఇంటి వద్దకే పంపారు. ఆ కార్‌ ఇప్పటికే బాలీవుడ్ నటుల్లో చాలామంది కొనుగోలు చేశారు. దీపికా పదుకొనే, అర్జున్ క‌పూర్ ఇలా ఎంతోమంది ప్రముఖులు కొన్నారు. దీని ధర రూ.3 కోట్లు.

జాక్వెలిన్ ఫెర్నాం డేజ్ :


మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే కొత్త ఖరీదైన లగ్జరీకారులను కొనడానికి ఈ ముద్దుగుమ్మ ముందు ఉంటుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా ఆమె ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ i7 కారును కొంది.. ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ సెడ‌న్ను కొనుగోలు చేసింది. దీని ధర రూ.2 కోట్లు.

నయనతార :


సౌత్ ఇండియన్ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారి దక్కించుకుంది. ఇటీవల తన 31వ‌ పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ తెలుపుతూ భర్త విగ్నేష్ శివన్‌ ఆమెకు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. మెర్సడేస్ మేబెంజ్ LS600 కొనుగోలు చేసింది. కాస్ట్ మూడున్నర కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ కూడా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దసరా నేపథ్యంలో ఏకంగా రూ.4 కోట్ల ఖరీదైన లంబోర్గిని హురాఖాన్ టెక్నికా కారును కొనుగోలు చేసింది. ఇక శిల్పా శెట్టి దీపావళి వేడుకల్లో హాట్ స్పైసీ రెడ్ కలర్ కార్లో మెరిసింది. వీరితో పాటు మరికొంతమంది ఇదే విధంగా లగ్జరీకారులను కొనుగోలు చేశారు.