నారింజ పండు తిన్న వెంట‌నే ఇవి తింటే మీరు డేంజ‌ర్లోకి వెళ్లిన‌ట్టే…!

శీతాకాలంలో దొరికే సీజనల్ పండ్లలో తీపి నారింజ కూడా ఒకటి. ఆరోగ్యకరమైన పోషక ఆహారంగా నారింజపండ్లను అందరూ తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి రుచి వల్ల కూడా చాలా మందికి నారింజ అంటే ఇష్టం ఉంటుంది. ఇక నారింజ పండును కొన్ని ఆహారాలతో జతి చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అల‌ర్జీలు, కడుపు నొప్పి ప్రేరేపించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.చిరు చేదు మరియు జూసి నారింజ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.

ఈ పండ్లను సాస్ల నుంచి జ్యూస్, డిజ‌ర్ట్‌ల‌ వరకు అందరూ బాగా ఇష్టపడుతుంటారు. అయితే నారింజలో సీట్రిక్ యాసిడ్ మరియు విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి. రోగనిరోధక శక్తి మరియు జీవన క్రియకు నారింజ ఎంతగానో సహకరిస్తుంది. కానీ వీటిని కొన్ని ఆహారాలతో తినడం వల్ల అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా అలర్జీలు, గుండెలో మంట, అసౌకర్యం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక నారింజ తో ఈ 12 రకాల ఆహారాలను తీసుకోకపోవడం మంచిది.

 

టమాట:


టమాటా, నారింజ రెండు విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉంటాయి. అలాగే రెండిట్లోనూ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కనుక ఈ రెండిటిని కలపడం అనేది మంచి విషయం కాదు.. రిపలిక్‌ లేదా జీర్ణ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌జ్య‌ల ప్రమాదం ఉంటుంది.

పెరుగు, అరటిపండు:


నారింజలో ఉండే ఆసిడ్స్ పెరుగుతో కలిపి తినడానికి కష్టంగా ఉంటాయి. అరటి పండ్లను కమల పండ్లతో కలిపి తింటే జర్న వ్యవస్థలో సమస్య ఏర్పడుతుంది. అలాగే కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది చాలా హానికరం.

పప్పులు:

నారింజలో ఉండే యాసిడ్లను చిక్కుడు లాంటి గింజ‌ల‌తో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ రుగ్మతలు ఏర్పడి అజీర్ణ సమస్యలకు దారితీస్తాయి.

స్పైసి ఫుడ్:


స్పైసి ఫుడ్స్ తో కలిపి నారింజను తీసుకోవడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థలో రుగ్మతలు ఏర్పడతాయి. కడుపు పుండు విషయంలో ఇది మరింత బాధను కల్పిస్తుంది. నారింజ యొక్క ఆమ్లతత్వంలో అధిక కొవ్వు ఆహారాలు.. శరీర ఆసౌకర్యానికి కారణం అవుతాయి. అలర్జీలు ఏర్పడతాయి.

చీజ్:


చీజ్‌, నారింజల మిక్స్ టెస్ట్ అసలు బాగోదు. దానికి తోడు విటమిన్లు మరియు పాలతో వచ్చే చీజ్ కలయిక వల్ల జీర్ణక్రియల సమస్యలు ఏర్పడతాయి.

పాలు:


పాలను చాలా పండ్లతో కలిపి జ్యూసులు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే సిట్రస్ పండ్లు లేదా జ్యూస్లతో పాల ఉత్పత్తులు జోడించడం అసలు మంచిది కాదు. గుండెలో మంట ఏర్పడడమే కాదు అజీర్ణ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు, కడుపు ఉబ్బరం, నొప్పికి దారితీస్తాయి.