” 2024 ఎన్నికలలో తారక్ ఆ పార్టీకే మద్దతు ఇస్తాడు “… గుట్టు బయటపెట్టిన కళ్యాణ్ రామ్ (వీడియో)

నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తరతరాలుగా తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ వీరి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నందమూరి కళ్యాణ్, తారక్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను దక్కించుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ ” డెవిల్ “.

అభిషేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. కళ్యాణ్ రామ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే ఎన్నికల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ” ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత కనీవిని ఎరుగని అద్భుతమైన, భయంకరమైన ఎలక్షన్ ఫైట్ రాబోతుంది.

మీరు ఎటువైపు ఉంటారు ” అని యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించగా.. దానికి నందమూరి హీరో రిప్లై ఇస్తూ..” ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఇది నా మాట కాదు. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది వేరు. పాలిటిక్స్ అనేవి వేరు. దీనికి ఫ్యామిలీ మొత్తం మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకుంటాము. నేను, తారక్ మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. వీరి ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.