బిగ్ షాకింగ్ : అడవుల్లో బట్టలు లేకుండా న్యూడ్ గా తిరుగుతున్న తెలుగు హీరో..ఎందుకో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు న్యూడ్ గా ఫోటోషూట్స్ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే వాళ్ళు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి తమ పేరుని పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకోవడానికి చేస్తుంటే ..మరి కొందరు మాత్రం పూర్తిగా ఆధ్యాత్మిత దైవచింతనలో ఇలా చేస్తున్నారు . రీసెంట్గా బాలీవుడ్ హీరో ఇలా బట్టలు లేకుండా న్యూడ్ గా అడవుల్లో తిరగడం మనం చూసాం . అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి యాడ్ అయిపోయాడు ఆదిత్య ఓం.

ఇలా చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు ..లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో హీరోగా నటించిన అబ్బాయి అంటే మాత్రం గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా అప్పట్లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అంతేకాదు ఆదిత్య ఇతర భాషల్లో కూడా తన మల్టీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు . హీరో గానే కాకుండా దర్శకుడుగా కూడా తాను ఏంటో నిరూపించుకున్నాడు . ఎన్నో అంతర్జాతీయ వేదికల్లో ఆయన తెరకెక్కించిన సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి .

కాగా ప్రస్తుతం ఆదిత్య ఓం “బంధి” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ చిత్రంలో హీరో మాత్రమే కనిపించడం గమనార్హం. అతన్ని ఎవరో బందీ చేశారు ..?ఎందుకు బందీ చేశారు ..? అడవుల్లో పడి అలా ఎందుకు తిరుగుతున్నాడు..? అనేది ఆసక్తికరంగా ఉండేటట్లు మనకు చూపిస్తారు. ముఖ్యంగా ఇందులో ఆదిత్య న్యూడ్ గా కనిపించడం షాకింగ్ గా అనిపిస్తుంది . ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ ఆయన చేయనేలేదు . దీంతో ప్రేక్షకుల్లో ఈ ట్రైలర్ పై ఆసక్తి పెరిగిపోయింది . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ ట్రైలర్ దుమ్ము దులిపేస్తుంది..!!