నటసార్వభౌమ ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగునాట ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా, రాజకీయవేత్తగా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్ మొదట పాల వ్యాపారిగా పని చేసేవాడు. అయితే ఎక్కడ మారుమూల ప్రాంతంలో పాల వ్యాపారిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినీ రంగంలో నటసార్వభౌమడిగా చెరగని ముద్ర వేసుకోవడానికి అతను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కారణం కృష్ణ‌వేణి. మన దేశం సినిమా ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆమే. ఇంత‌కి ఈ కృష్ణవేణి ఎవరు ఈమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబర్ 24న జన్మించిన కృష్ణవేణి. తండ్రి డాక్టర్. స్కూల్లో డ్రామాల‌లో పలు వేషాలు వేసి బహుమతులు అందుకున్న కృష్ణవేణి ఆ తర్వాత వెండితెరపై ప్రేక్షకులను మెప్పించింది. డైరెక్టర్ క‌మ్‌ ప్రొడ్యూసర్ గా మంచి పాపులారి దక్కించుకున్న సి.పుల్లయ్య బాలనటినట్లతో సతీ అనసూయ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో కృష్ణవేణి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమా తర్వాత కూడా పలు నాటకాల్లో మెప్పించిన ఈమె.. తండ్రి కృష్ణమూర్తి చనిపోవడంతో అమ్మమ్మ , బాబాయిల వద్ద పెరిగింది.

తర్వాత తుకారం సినిమా తో చెన్నైలో అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోలేదు. అయితే హీరోయిన్గా కృష్ణవేణి నటించిన మొదటి సినిమా మాత్రం క‌చ‌దేవయాని. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. మహానంద సినిమాలో నటించేందుకు చెన్నైలో స్థిరపడిన ఈమె ఈ సినిమా తర్వాత దర్శక, నిర్మాత మీర్జాపురం రాజాను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత బయట సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేని కృష్ణవేణి సొంత బ్యానర్లో శోభనాచల స్టూడియోస్ నిర్మించిన జీవనజ్యోతి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాతో సిహెచ్ నారాయణ హీరోగా పరిచయమయ్యారు. తర్వాత ఎన్నో సినిమాల‌లో నటించిన ఈమె గొల్లభామ లక్ష్మమ్మ, అనసూయ లాంటి సినిమాలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాత ఈ దంపతులు.. రాజ్యలక్ష్మి అనురాధకు జన్మనిచ్చారు. భర్త రాజా నిర్మాణ పనుల్లో బిజీగా ఉండడంతో నటనకు స్వస్తి చెప్పి స్టూడియో వ్యవహారాలను చూసుకుంది కృష్ణవేణి. కుమార్తె పేరుపై ఎమ్ఆర్ఏ ప్రొడక్షన్స్ స్థాపించి మొదటి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ డైరెక్షన్‌లో మన దేశం సినిమాను తెరకెక్కించింది.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసింది కృష్ణవేణి. వరూధిని సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును కూడా పిలిపించి ఈ సినిమాలో అవకాశం ఇచ్చింది. తన ఆలోచన విధానంతో అభిరుచితో తెరకెక్కించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా కృష్ణవేణి పాపులారిటీ దక్కించుకుంది. ఇలా నటిగా, నిర్మాతగా, గాయనిగా ఎన్నో సినిమాల్లో పని చేసిన ఈమె 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకుంది. సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్‌లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం కూడా తీసుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను ద‌క్కించుకుంది.