ఆ స్టార్ నిర్మాత కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన శర్వానంద్… ఆఖరికి కాఫీ షాప్ ని కూడా వదలడం లేదుగా…!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బుల కోసం, పాపులారిటీ కోసం సినిమాలు చేయకుండా తమకు నచ్చినటువంటి సినిమాలు మాత్రమే చేసే హీరోలలో శర్వానంద్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్… అనంతరం హీరోగా మారి.. ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకి అందించాడు. ఈయన పెద్ద హీరో అయ్యుండకపోవచ్చు.. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈయన కెరీర్లో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.

ఇక ఒకే ఒక జీవితం అనే సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న శర్వానంద్.. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య అనే నూతన దర్శకుడు తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే… శర్వానంద్ ఇతర హీరోలు లాగా భారీ రెమ్యూనరేషన్ తీసుకోడు. తన మార్కెట్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తి. కానీ ఒక నిర్మాత నుంచి శర్వానంద్ కి చాలా టార్చర్ ఎదురు అయ్యిందట.

తనతో ముందు కమిట్ అయిన రెమ్యూనరేషన్ లో కేవలం కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చి, పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా తప్పించుకున్నాడు. ఇక శర్వానంద్ పాపం అప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి ఎమర్జెన్సీ గా డబ్బులు కావాల్సి వచ్చింది. తనకి కావాల్సిన అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ.. ఆ నిర్మాత మాత్రం శర్వానంద్తో మాట్లాడేందుకు మొహం చాటుతూ వచ్చాడు. పోనీ సినిమా ఫ్లాప్ అయ్యి అలా చేశాడు అంటే అది కూడా కాదు. సినిమా హిట్ అయింది. ఇక ఆఖరికి శర్వానంద్ కి ఏం చెయ్యాలో తెలియక.. తన కాఫీ షాప్ ని అమ్మేందుకు కూడా సిద్ధపడ్డాడట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.